ఢిల్లీలో జాతీయ పంచాయత్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హాజరైయ్యారు. దీన్ దయల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికారన్, నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ పురస్కారాలను నరేంద్ర సింగ్ తోమర్ ప్రధానం చేశారు.
దీన్ దయల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికారన్ పురస్కారాలు..
జనరల్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లాకు అవార్డు..జనరల్ విభాగంలో పెద్దపల్లి జిల్లాలోని మంథని, జగిత్యాలలోని వెల్గటూర్ మండల పంచాయతీలకు అవార్డు..శానిటేషన్ విభాగంలో మెదక్ జిల్లా మల్కాపూర్, పెద్దపల్లి జిల్లా మల్లారం గ్రామ పంచాయితీలకు అవార్డు..సోషల్ సెక్టార్ డెవలప్మెంట్ విభాగంలో సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామ పంచాయితీకి అవార్డు..జనరల్ విభాగంలో నిజామాబాద్ జిల్లా నాగపూర్ గ్రామ పంచాయితీలకు అవార్డు లు దక్కాయి.
పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కి నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారం అందుకుంది. అలాగే జగిత్యాల జిల్లా పడిమడుగు గ్రామ పంచాయతీకి చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ అవార్డు దక్కింది.ఈ అవార్డులు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ గ్రామ సర్పంచులు అందుకున్నారు.