- Advertisement -
జార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీంఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన సత్తా చాటుతున్నాడు. తాజాగా సెంచరీతో చెలరేగిపోయాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను తన సెంచరీతో ఆదుకున్నాడు రోహిత్. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ మూడు సెంచరీలు చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రహానెతో కలిసి రోహిత్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ 3 వికెట్లు కోల్పోయి, 200 పరుగులు చేసింది. ఈరోజు తొలి సెషన్ ఆరంభంలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (10), చతేశ్వర్ పుజారా (0), విరాట్ కోహ్లి (12) ఔటవడంతో తన సహజశైలికి భిన్నంగా రోహిత్ శర్మ ఓపికగా ఆడాడు.
- Advertisement -