నటుడిగా మారనున్న మరో క్రికెటర్..!

501
irfan patan
- Advertisement -

క్రికెట్ మరియు సినిమాలకు చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. క్రికెటర్‌లు,సినిమా స్టార్లు కలిసి యాడ్స్‌ చేయడం,క్రికెట్‌ ఆటగాళ్లతో సినిమా తారలు సన్నిహితంగా ఉండడం,వారితో ప్రేమలు,పెళ్లిళ్లు కూడా జరిగింది. ఎప్పటి నుండో క్రికెట్ మరియు సినిమా కలిసి ప్రయాణం చేస్తున్నాయి.

ఇక ఐపీఎల్‌ ప్రారంభించినప్పటి నుండి వీరి సందడి మరీ ఎక్కువైందని చెప్పాలి. ఇక క్రికెటర్లు ఏకంగా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇప్పటికే టీం ఇండియా మాజీ పాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్ హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలోనే మరో క్రికెటర్ కూడా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

patan

అతడు ఎవరనేగా మీ సందేహం.. అతనేవరోకాదు ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ఏంటీ నమ్మడం లేదా..! ఈ విషయాన్ని ఇర్ఫాన్ స్వయంగా తానే ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. త్వరలో చియాన్ విక్రమ్ హీరోగా నటించే సినిమాలో తాను నటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పఠాన్ పాత్ర గురించి మాత్రం ఎలాంటి సమాచారమివ్వలేదు. కొత్త సవాల్‌ను స్వీకరించడానికి ఎదురుచూస్తున్నట్లు ఈ ఫాస్ట్ బౌలర్ తెలిపాడు.

ఇర్ఫాన్ పఠాన్ భారత విజయాల్లో అద్భుత పాత్ర పోషించిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్, టెస్టుల్లో హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. ఇర్ఫాన్ ప్రస్తుతం ఇండియా, సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో భాగంగా ఎక్స్‌పర్ట్ ప్యానెల్ సభ్యుడిగా ఉన్నారు.

- Advertisement -