యాదాద్రిని గొప్ప పర్యాటక కేంద్రంగా రూపొందించాలి

505
minister-srinivas-goud
- Advertisement -

బేగంపేట లోని పర్యాటక భవన్ లో తెలంగాణ టూరిజం పై రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ కమిషనర్ సునీతా భగవత్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మీ, టూరిజం M D మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, టూరిజం E D శంకర్ రెడ్డి మరియు టూరిజం అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాదాద్రి లో అత్యద్భుతంగా నిర్మిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద 90 ఎకరాలను కేటాయించారు. అట్టి స్థలాన్ని యాదాద్రి జిల్లా కలెక్టర్ పర్యాటక శాఖ కు అందజేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి వద్ద మహాద్భుతమైన నిర్మాణము కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో నిండనున్న బస్వాపూర్ రిజర్వాయర్ నిత్యం నీటితో కళకళలాడు తుంది. కావున , దేశ విదేశీ పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే విధంగా సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం పర్యాటక రంగ నిపుణులు మరియు ఉన్నత అధికారులతో సంప్రదింపులు జరిపి గొప్ప పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

అదేవిధంగా నగరానికి అనుకోని ఉన్న శామిర్ పెట్ చెరువు దాని పరిసరాలను ప్రభుత్వ – ప్రవేటు భాగస్వామ్యం తో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందించాలని కోరారు. హైదరాబాద్ మహా నగరంలో పర్యాటక శోభను పెంపొందించుటకు హుస్సేన్ సాగర్ జలాశయం, గండిపేట, అదే విధంగా నగరానికి అనుకోని ఉన్న బద్వేలు వద్ద నూతన ప్రాజెక్టులను రూపొందించాలని అధికారులను కోరారు. ప్రభుత్వ – ప్రవేట్ భాగస్వామ్యం లో నడుపుతున్న పలు పర్యాటక ప్రాజెక్టులను మంత్రి ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు.

- Advertisement -