పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిద్వార్‌లో పర్యటించారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజేంద్రసింగ్ ఆహ్వానం మేరకు హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమానికి చేరుకున్న పవన్ ప్రొఫెసర్ జిడి అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహారాజ్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. ఒక మహత్తర కార్యక్రమం కోసం జి.డి అగర్వాల్ ప్రాణాలు అర్పించడం నన్నెంతో కలచి వేసిందన్నారు.
గంగా నదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం చేస్తున్నాయో ఈ సందర్భంగా శివానంద మహారాజ్….పవన్ కళ్యాణ్‌కి వివరించారు. గంగా నది ప్రక్షాళన కోసం దక్షిణాది నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని.. పవన్ ఆ లోటును భర్తీ చేయాలని శివానంద మహారాజ్ కోరారు. అనంతరం గంగా హారతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.