మున్నా భాయ్‌తో మంచు విష్ణు

606
manchu vishnu
- Advertisement -

విష్ణు మంచు హీరోగా కాజల్ అగర్వాల్, చిలసౌ ఫేమ్ రుహానీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కాల్‌సెంటర్‌’.ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ని ప్రేక్షకులకు అందించాడు మంచు విష్ణు. ‘కాల్‌ సెంటర్‌’ షూటింగ్‌ లొకేషన్‌కు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చారని ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.

జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫుల్‌ స్పీడ్‌గా జరుగుతోంది. ప్రస్తుతం సంజయ్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ లో సూర్యవర్ధన్ తమ్ముడు ‘అధీరా’గా కనిపించనున్నాడు.

- Advertisement -