ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అమెరికాలో మూడు మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం కొనసాగుతున్న తీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్‌తో పటు టిఆర్ఎస్ అమెరికా నాయకులైన శ్రీనివాస్ గనగోని,దేవేందర్ నల్లమాడ,శ్రీనివాస్ మలై మరియు వెంకట్ గజ్జల పాల్గొన్నారు.
మహేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రంపంచమంత హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్నది. అనేకమంది ప్రముఖులు, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు.ఆకు పచ్చని తెలంగాణ కోసం మేము సైతం అంటున్నారు. మేము అమెరికాలో మొక్కలు నాటితే తెలంగాణాలో ఉన్న ప్రజలు మమల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
టిఆర్ఎస్ అమెరికా నాయకులు మహేష్ తన్నీరు,యూ కే టిఆర్ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనిల్ కూర్మాచలం,టిఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ కాసర్ల నాగేందర్ రెడ్డి,న్యూజిలాండ్ ప్రెసిడెంట్ విజయ్ కొసన,టిఆర్ఎస్ డెన్మార్క్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్యామ్ బాబు ఆకుల,బెహ్రయిన్ ప్రెసిడెంట్ రాదారపు సతీష్,సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ నాగరాజు గుర్రాలకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. మేము విదేశాలలో మొక్కలు నాటడం ద్వారా మా కుటుంబ సభ్యులు, బందు మిత్రులు స్ఫూర్తి పొందుతారన్నారని మహేష్ బిగాల అన్నారు.
#GreenIndiaChallenge has spread its wings over America now. Happy that @mbigala our TRS NRI Co-ordinator has accepted my nomination by planting saplings in USA and nominated 7 other TRS country heads.#HaraHaiTohBharaHai#HarithaHaram 🌱🌳 pic.twitter.com/jSu5juAKjv
— Santosh Kumar J (@MPsantoshtrs) October 7, 2019