రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు..

623
kcr cm
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ మానవాళి కి ఓ సందేశం అని ముఖ్యమంత్రి అన్నారు.దసరా ప్రజల జీవితాలలో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షించారు. దసరా పండుగ మనిషిని మంచిమార్గంలో నడిపించడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ అత్యంత ఆనందంతో పండుగ జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని అన్నారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్న ప్రజలు మరింత ఉత్సహంగా దసరా పండుగ జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

- Advertisement -