మెగా సుప్రిమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గత కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుస్తున్న టైమ్‌లో ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ మెగా హీరో ‘ప్రతీరోజూ పండగే’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా.. తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు కొత్త సినిమా టైటిల్‌ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం.
ఈ చిత్రానికి `సోలో బ్రతుకే సో బెటర్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు.సాయి తేజ్, నభా నటేశ్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విజయదశమి సందర్భంగా సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి.
ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.