హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై బతుకమ్మ ఉత్సవాల ముగింపు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ,సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు,ఎమ్మెల్సీ ఆకుల లలిత,డిప్యూటీ మేయర్ బాబా ఫసిదుద్దీన్,ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ హాజరైయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ పండుగ ,మహిళల పండుగ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పరంగా జరిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ట్యాంక్ బండ్పై బతుకమ్మ వేడుకలను అధికారికంగా జరుపుకుంటున్నాం. ఒకప్పుడు ఉద్యోగులు సెక్రటేరియట్లో బతుకమ్మ అడాలంటే ఎన్నో ఆంక్షలు పెట్టారు..అలాంటి ఆంక్షలను ఎదుర్కొని జాగృతి సంస్థను స్థాపించి బతుకమ్మను దేశ విదేశాల్లో ఆడించి ఉద్యమానికి మమేకం చేశారు కవిత.
ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి.ఇక్కడి పథకాలను వారి రాష్ట్రాల్లో అమలు చేయాలి అని ఆలోచిస్తున్నారు. బతుకమ్మ పుట్టినిల్లు లాంటి వరంగల్ నుండి వేడుకలు ప్రారంబిచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.ఈ రోజు హైదరాబాద్ ట్యాంకుబండ్ మీద ఘనంగా ముగించుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కొత్త పథకాలు తెచ్చేటట్లు వారికి బలన్నిచ్చేట్లు అక్కా చెల్లెలు ఆశీర్వదించగలరని మంత్రి తలసాని కోరారు.