చంచల్ గూడ జైలుకు రవిప్రకాశ్

503
raviprakash1
- Advertisement -

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు బంజారాహిల్స్ పోలీసులు. టీవీ9లో నిధుల దుర్వినియోగం కేసులో అతన్ని రిమాండ్ కు తరలించారు. మరో డైరెక్టర్‌తో కలిసి రవిప్రకాష్ రూ. 18 కోట్లను పక్కదారి పట్టించినట్లుగా ఆధారాలతో టీవీ 9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో నిందితులపై 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది. వైద్య పరీక్షల అనంతరం రవిప్రకాష్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రవిప్రకాష్‌కు ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కాగా, రవిప్రకాశ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 9న వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.

- Advertisement -