గవర్నర్ తమిళిసైని కలిసిన చిరంజీవి

467
Chiranjeevi Meets Governer Tamilisai
- Advertisement -

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఈరోజు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండగను పురస్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. చిరంజీవి తాను నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విశేషాలను ఆమెతో పంచుకున్నారు.

Chiranjeevi Meets Tamilisai

స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘సైరా’ చిత్రాన్ని చూడమని గవర్నర్ ను కోరారు చిరంజీవి. అందుకు, ఆమె సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. చిరంజీవి తెలంగాణ గవర్నర్‌ను కలవడంపై రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -