ఆర్టీసీ సమ్మె.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

552
somesh kumar
- Advertisement -

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీతో కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇవాళ అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాల ప్రకటించడాన్ని తప్పుబట్టారు త్రిసభ్య కమిటీ సభ్యలు.

ఆర్టీసీలో సమ్మె చేయడం సరికాదని సమ్మె చేసే కార్మికులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని వారు తెలిపారు. దసరా తెలంగాణలో పెద్ద పండగ అని తెలిపిన సోమేష్ కుమార్… జేఏసీ ప్రతిపాదించిన 26 అంశాలపై నివేదిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

రేపటి నుంచి 2100 అద్దె బస్సులు నడుపుతామని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా స్కూల్ బస్సులు నడుపుతామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో సుదీర్ఘంగా చర్చించామని కానీ ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. సమ్మె నివారణకు జరపాల్సిన చర్యలన్ని చేపట్టామన్నారు.

- Advertisement -