మణిరత్నంపై దేశద్రోహం కేసు..!

654
mani ratnam
- Advertisement -

దేశంలో జరుగుతున్న మూకుమ్మడి దాడులు,హత్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాసినందుకు గాను 50 మంది సెలబ్రిటీలపై దేశ ద్రోహం కేసు నమోదైంది. రామచంద్ర గుహ, మణిరత్నం, అపర్ణా సేన్‌ తదితరులపై దేశద్రోహం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు ఢిల్లీ పోలీసులు. న్యాయవాది సుధీర్‌ కుమార్‌ ఓజా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్ధానం ఆదేశాల మేరకు ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది.

దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, శ్యాం బెనగల్‌ అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ, శుభ ముద్గల్ లాంటి సెలెబ్రిటీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు.

దీనికి నిరసనగా సుధీర్‌కుమార్‌ ఓజీ బీహార్ లోని బీహార్ లోని ముజఫర్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ వీరిపై కేసు నమోదుచేయాలని ఉత్తర్వులిచ్చారు.

- Advertisement -