బంగ్లాదేశ్ క్రికెటర్లు క్రమశిక్షణని ఉల్లంఘించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో తమకు కేటాయించిన హోటల్ గదులకు అమ్మాయిలను తెప్పించుకున్నారు. ఈ విషయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు తెలిసింది. దిన్ని తప్పిదాన్ని తీవ్రంగా పరిగణించిన సదరు ఆటగాళ్ళకు ఫైన్ విధించింది. ఇంతకీ ఆ ఆటగాళ్ళు ఎవరంటే.. పేస్ బౌలర్ అల్ అమీన్ హుస్సేన్, బ్యాట్స్‌మన్ షబ్బీర్ రహమాన్.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) సందర్భంగా మైదానం వెలుపల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పేసర్ అల్ అమీన్ హొస్సేన్, బ్యాట్స్‌మన్ సబ్బీర్ రహ్మాన్‌కు రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించినట్టు బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. టూర్ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు హోటల్ రూమ్‌లకు మహిళలను తీసుకెళ్లినట్టు ఓ పత్రిక పేర్కొంది. జరిమానా విధించిన బంగ్లా బోర్డు దానికి కారణాన్ని వెల్లడించకుండా కేవలం క్రమశిక్షణ ఉల్లంఘన అని మాత్రమే పేర్కొంది. జట్టు ప్రతిష్ఠను మసకబార్చే పనులు చేయవద్దని, మరోసారి ఇలా జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బోర్డు హెచ్చరించింది.