నేడు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

349
cpi
- Advertisement -

నేడు సీపీఐ రాష్ట్రకార్యవర్గం నేడు హైదరాబాద్ లోని మగ్దూం భవన్‌లో భేటీకానుంది. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుపై చర్చించనున్నారు. దీంతో పాటు డిసెంబర్ 20,21,22,23 తేదీల్లో మంచిర్యాలలో జరగనున్న సిపిఐ నిర్మాణ మహాసభ ఏర్పాట్లను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. టీఆర్ఎస్ తో పొత్తు విషయంలో నేడు ప్రకటన చేయనున్నారు.

ఉద్యమ సమయంలో టీఆర్ఎస్,సీపీఐ కలిసి పోరాడాయని గుర్తుచేశారు. రాజ్యసభ ఎన్నికల్లోనూ సీపీఐ ఓట్లు కేశవరావుకే పడ్డాయని చెప్పారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు,సీనియర్ నాయకుడు అతుల్‌కుమార్ అంజాన్ హాజరుకానున్నారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం ఎంపీ కేశవరావు, మాజీ ఎంపీ వినోద్ పలువురు నేతలు సీపీఐ నేతల్ని కలిశారు.

- Advertisement -