డ్రంకన్‌ డ్రైవ్…236 మందిపై కేసు

432
drunk and drive
- Advertisement -

సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రంకన్ డ్రైవ్‌లో 236 మంది పట్టుబడ్డారు.  శని,ఆదివారాల్లో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో 30మంది ఐటీ ఉద్యోగులు, 8 మంది విద్యార్థులు, ముగ్గురు యోగా శిక్షకులు ఉన్నారు. వీరిని ఇవాళ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

ఓ మనిషిలో 100 మిల్లీలీటర్ల రక్తానికి 35గ్రాముల అల్కాహాల్‌ ఉండాలి… అది దాటి మత్తు పెరిగితే మనిషి విచక్షణ కోల్పోతాడని వైద్యపరంగా నిరూపించబడింది. అందుకే ఆ పరిమితిదాటి వ్యక్తులు వాహనాలు నడిపిస్తే రోడ్ల పై బీభత్సమేనని పోలీసులు చెబుతున్నారు.

- Advertisement -