గత వారం రోజులుగా భారీ వర్షాలు భాగ్యనగరాన్ని కుమ్మేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎందుర్కొంటున్నారు. నాలుగు రోజుల క్రితం కూడా హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు, నాలాలు, కాలువలు జలమయం అయ్యాయి. కాగా ఈ వర్షాలు శనివారం నుండి కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తునే ఉన్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ హైదరాబాద్లో ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అలాగే బయట ప్రాంతాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రయాణాలు చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షం కారణంగా ఇబ్బందులు వస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు సీపీ అంజన్ కుమార్.
మరోవైపు ఏపీ తెలంగాణతో పాటు భారీ వర్షాలు ఉత్తరాదిని సైతం వణికిస్తున్నారు.బీహార్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు బీహార్, యూపీ అతలాకుతలం అయ్యాయి. ఇటు ఎన్టీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి.