- Advertisement -
తెలంగాణ సర్కారు చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులపై పిటీషన్‌ను ఎన్జీటి విచారణ చేపట్టింది. అయితే కాలేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను ఎన్జీటి తోసిపుచ్చింది. కాలేశ్వరం మద్యంతర పిటిషన్‌లో కొత్త అంశాలేవీ లేవని జస్టిస్ రఘువేంద్ర ఎస్ రాథోడ్ ధర్మాసనం తెలిపింది.
ప్రధాన పిటిషన్ లోని అంశాలను మధ్యంతర పిటిషన్ లోనూ పేర్కొన్నారని ధర్మాసనం అభిప్రాయ పడింది. అయితే దీనిపై సవరించిన మధ్యంతర పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని పిటిషనర్‌కి ధర్మాసనం సూచించింది. కాగా ఈ పిటీషన్‌పై తదుపరి విచారణ అక్టోబర్ 21 కి వాయిదా పడింది.
- Advertisement -