నేటీ నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

321
Batukamma Saries
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఆడపడచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనుంది సర్కార్. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇప్పటికే ప్రతి గ్రామానికి తగిన చీరలను సరాఫరా చేశారు. రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ నల్గొండలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గోననున్నారు.

కాగా పంచాయతీ రాజ్ శాఖ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌లో జిల్లాలోని దేవరుప్పలలో తలపెట్టిన బతుకమ్మ చీరల పంపణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మిగిలిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సైతం బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నారు. మొత్తం 1.02 కోట్ల చీరలను అర్హులైన ప్రతి మహిళలకు రాష్ట్రప్రభుత్వం అందజేయాలని లక్షంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ. ౩13 కోట్ల రూపాయలను వెచ్చించింది.

- Advertisement -