టీడీపీ మాజీ ఎంపీ కన్నుమూత

372
Former Mp nShivaprasad
- Advertisement -

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన… చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. చెన్నైలో చికిత్స పొందుతున్న ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పరామర్శించారు. శివ ప్రసాద్ వృత్తి రిత్యా వైద్యుడు కాగా ఆయన సినిమాల్లో కూడా నటించారు.

శివప్రసాద్ 1951 జులై పదకొండున నాగయ్య, చెంగమ్మ దంపతులకు జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. తిరుపతిలో డాక్టర్ గా సేవలందిస్తూ సినీరంగంలో ప్రవేశించారు. అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చారు. కొన్ని సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. సయ్యాట, దూసుకెళ్తా, తులసి, మస్కా, ద్రోణ, కుబేరులు, ఆటాడిస్తా, ఒక్కమగాడు, డేంజర్‌, కితకితలు, ఖైదీ, జైచిరంజీవ, పిల్ల జమీందార్‌, బలాదూర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలతోపాటు మరెన్నో చిత్రాల్లో నటించారు.

శివప్రసాద్‌ 1999-2004 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999-2001 మధ్య సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శివప్రసాద్ 2009లో చిత్తూరు టీడీపీ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 లోనూ శివప్రసాద్ ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు.

- Advertisement -