రైతుగా స్టార్ దర్శకుడు

358
VV Vinayak.jpeg
- Advertisement -

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన సినిమాలు ఈమధ్య అంత పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆయన దర్శకత్వానికి స్వస్తి చెప్పాడు. తాజాగా ఆయన హీరోగా ఓసినిమా తెరకెక్కుతుంది. శరభ మూవీ దర్శకుడు నరసింహరావు ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందుకు సంబంధించి వినాయక్ ఇప్పటికే వర్కవుట్ ప్రారంభించాడు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం అక్టోబ‌ర్ 9న‌ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 9న వినాయక్ పుట్టిన రోజు కావడంతో అదే రోజు సినిమాను ప్రారంభించనున్నారు. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్క‌నున్న ఈ సినిమా కథ 1940ల కాలం నాటికి సంబంధించిన‌దిగా ఉంటుంద‌ని తెలుస్తుంది.

ఈమూవీలో వినాయక్ రైతు పాత్రలో కనిపించనున్నారు. వివి వినాయక్ ఇప్పటికే ఠాగూర్, ఖైదీ నంబర్ 150, నేనింతే చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌లో కనిపించిన విష‌యం తెలిసిందే. ఈమూవీలో వినాయక్ సరసన శ్రేయ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

.

- Advertisement -