మరోసారి సంపత్ నందితో గోపిచంద్‌

568
gopichand
- Advertisement -

మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కానుంది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘గౌతమ్ నంద’ హిట్ కాకపోయిన గోపిచంద్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

గోపిచంద్‌కు 28వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ‘యూ టర్న్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నెం.3’ గా నిర్మిస్తున్నట్లు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. వరంగల్‌కు చెందిన సంపత్ నంది కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించనున్నారు.

ప్రస్తుతం గోపిచంద్‌ నటిస్తున్న చాణక్య దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వం వహిస్తున్నారు. బినూ సుబ్రమణియన్ అనే మరో తమిళ దర్శకుడితో గోపిచంద్ సినిమా ఇటీవలే ప్రారంభంమైంది. ఈ రెండు సినిమాల తర్వాత సంపత్ నంది- గోపిచంద్ మూవీ పట్టాలెక్కనుంది.

- Advertisement -