తెలంగాణ,ఏపీలో దసరా సెలవులు ప్రకటించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగానలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులను ప్రకటించగా ఏపీలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులను అనౌన్స్ చేశారు.
అక్టోబరు 6న దుర్గాష్టమి, అక్టోబరు 7న మహర్నవమి, అక్టోబరు 8న విజయదశమి పర్వదినాలు రానున్నాయి. 16 రోజులపాటు సెలవులను ప్రకటించగా అక్టోబర్ 14న పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. సెలవు రోజుల్లో తరగతులు నడిపే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9 వరకు సెలవులు ఇవ్వనున్నటు ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. అక్టోబరు 10 కళాశాలలు తిరిగి తెరచుకోనున్నాయి.
ఏపీలో అక్టోబరు 10 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే దసరా సెలవులను అక్టోబరు 13 వరకు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.