మృతుల కుటుంబాలకు మంత్రి సత్యవతి సానుభూతి..

473
Minister Satyavathi Rathod
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, దేవిపట్నం మండలం, పాపికొండల వద్ద పర్యాటక శాఖ పడవ ప్రమాదం పట్ల రాష్ట్ర గిరిజన, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని, తగిన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -