హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద కోలా హలం నెలకొంది. హుస్సెస్ సాగర్ వద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్యూ కట్టారు. మరికాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇక బాలాపూర్ వినాయకుడు వేలం పాట కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.
దీంతో ఈరెండు విగ్రహాలను చూసేందుకు భక్తులు భారీగా ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. దీంతో పాటు భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో ఆదనంగా మెట్రో సర్వీసులతో పాటు… పత్రీ 4.5 నిమిషాలకో రైలు నడుపుతామని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
సాధారణంగా మియాపూర్, ఎల్బీనగర్ నుంచి రాత్రి 10.30 గంటలకు చివరి మెట్రో రైళ్లు బయల్దేరుతాయని, గురువారం మాత్రం భక్తుల రద్దీని బట్టి అవసరమైతే ఆర్ధరాత్రి తర్వాత కూడా సర్వీసులు నడుపుతామని తెలిపారు.