హైదరాబద్ లోని మసాబ్ ట్యాంక్ లోని పురపాలక శాఖ భవనంలో మంత్రి కేటీఆర్ ను కలిశారు అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ . కేటీఆర్ రెండవ సారి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు శుభాకాంక్షాలు తెలిపారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న అమెరికన్ పెట్టుబడులు, భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలను ఇరువురు చర్చించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా నగరం అభివృద్ధి పథంలో దూసుకుపొతున్నదని తెలిపారు కేటీఆర్.
వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను కాన్సుల్ జనరల్ కు వివరించారు. గత కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా బదిలీ అనంతరం నూతన కాన్సుల్ జనరల్ గా జోయల్ రీఫ్ మాన్ భాద్యతలు స్వీకరించారు. కాన్సుల్ జనరల్ తోపాటు కాన్సులర్ ఛీఫ్ ఏరిక్ అలగ్జాండర్, ఎకానమిక్ స్పెషలిస్ట్ క్రిష్టెన్ లోయిర్ లు మంత్రిని కలిసిన బృందంలో ఉన్నారు. అనంతరం కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ ను శాలువాతో సన్మానించి జ్నాపికను అందజేశారు కేటీఆర్. ఈ సమావేశంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు కూడా ఉన్నారు.
Great meeting you Joel. Look forward to working with you closely https://t.co/fG4ptDqRr4
— KTR (@KTRTRS) September 11, 2019