బన్నీ ఫ్యాన్స్‌కి త్రివిక్రమ్ బర్త్‌డే ట్రీట్…!

373
trivikram allu arjun

బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఇక నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు దసరాకి అక్టోబర్ 8న స్పెషల్ టీజర్‌ని విడుదల చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట.

ఈ సినిమాలో హీరో సుశాంత్‌తో పాటు ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ ఎనర్జీ, కామెడీ టైమింగ్‌కి, త్రివిక్రమ్ మాటల తూటాలు కలిస్తే ఫ్యాన్స్‌కి పండగేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.