ప్రమాణం చేసే కొత్త మంత్రులు వీళ్లే

342
kcr
- Advertisement -

సాయంత్రం 4గంటలకు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. కొత్తగా ఆరుగురు మంత్రులను కేబినెట్ లో చేర్చుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారి పేర్లు అధికారికంగా ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం కొంత మంది పేర్లుచక్కర్లు కొడుతున్నాయి.

హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాధోడ్, పువ్వాడ అజయ్ లకు బెర్త్ కన్ఫామ్ అయినట్లు తెలస్తుంది. మంత్రులుగా ప్రమాణం చేశాక.. వారికి కేటాయించిన శాఖలపై సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేస్తుంది. ఆ తర్వాత వారి శాఖల్లో మంత్రులు బాధ్యతలు తీసుకుంటారు.

- Advertisement -