ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ బయోడేటా

413
Puvvada Ajay Kumar

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేడు సాయంత్రం 4గంటలకు జరుగనుంది. మంత్రివర్గం లోకి కొత్తగా ఆరుగురికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈసందర్భంగా పలువురి పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా అఫిషియల్ గా సాయంత్రం తెలియనుంది. ఇక మంత్రి వర్గ ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి.

ఇందులో భాగంగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కు సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి ఫోన్ చేశారు. సాయంత్రం జరిగే మంత్రి వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని తెలియజేశారు. దీంతో వెంటనే పువ్వాడ అజయ్ కుటంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు పయనమయ్యారు.

కుటుంబ నేపధ్యంః
పువ్వాడ అజయ్ 1965 ఎప్రిల్ 19తేదిన జన్మించారు. పువ్వాడ నాగేశ్వర్ రావు విజయ లక్ష్మీ దంపతులకు ఆయన జన్మించారు. పువ్వాడ అజయ్ కి ఒక కుమారుడు ఉన్నాడు.

విధ్యాభ్యాసంః
పువ్వాడ అజయ్ స్కూల్ చదువు మొత్తం ఖమ్మంలోని మోంట్ ఫోర్ట్ స్కూల్ లో పదవతరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఖమ్మం నగరంలోని ఏయస్సార్ కాలేజీలో పూర్తి చేశారు.
ఆ తర్వాత డిగ్రీని హైదరాబాద్ లో చదివారు. డిగ్రీలో ఆయన ఎమ్మెస్సీ అగ్రీకల్చర్ లో గోల్డ్ మెడల్ ను సాధించాడు. ప్రస్తుతం ఆయన ఖమ్మం నగరంలో మమతా మెడికల్ కాలేజికి చైర్మన్ గా కొనసాగుతున్నారు. అలాగే పువ్వాడ ఫౌండేషన్ స్ధాపించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు.
రాజకీయ జీవితంః
పువ్వాడ అజయ్ 2012సంవత్సరంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట ఆయన 2012లో వైయస్సార్ సీపీ పార్టీ లో చేరారు. వైసీపీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. అనంతరం 2013సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2016సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటివలే 2018సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్ధానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.