వనమిత్ర అవార్డును ఆవిష్కరించిన ఎంపీ సంతోష్ కుమార్

420
Vanamithra
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ డాక్టర్ఏ పీ జె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డ్స్ ఇవ్వాలని ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ నిర్ణయించింది . ఇందులో భాగంగా రూపొందించిన అవార్డ్స్ ను రాజ్యసభ ఎంపీ , సంస్థ ప్యాట్రన్ జోగినపల్లి సంతోష్ కుమార్ గురువారం ఆవిష్కరించారు .

మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ కు రూపకల్పన చేసిన సంస్థ ఫౌండర్ కరుణాకర్ రెడ్డి , కో ఫౌండర్ రాఘవ లను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు . మొక్కలు నాటిన వారందరికీ వనమిత్ర అవార్డులను త్వరలో అందజేస్తామని సంస్థ కో ఫౌండర్ రాఘవ తెలిపారు . ఇప్పటివరకు ఒక కోటి 13 లక్షల మంది భాగస్వామ్యంతో రెండు కోట్ల 83 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు.

- Advertisement -