సిద్దిపేటలో గోల్కొండ షోరూం..ప్రారంభించిన హరీష్

636
harish rao
- Advertisement -

కళలను, కళాకారులను ప్రోత్సాహించి అంతరించి పోయిన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. జిల్లా కేంద్రంలో రూ. 2 కోట్లతో నిర్మించిన గోల్కొండ షోరూం భవనంను ప్రారంభించారు హరీష్.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ … సిద్దిపేట కు వన్నె తెచ్చేలా గోల్కొండ షోరూం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయాలను గౌరవం తెచ్చేలా సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని చెప్పారు. మన రాష్ట్ర గోల్కొండ ప్రాచుర్యం తెచ్చేలా వృత్తి కళాకారులను ప్రోత్సాహిస్తున్నామని చెప్పారు.

సిద్దిపేటలో 2కోట్ల తో గోల్కొండ షోరూం ఏర్పాటు చేశాం… సిద్దిపేట ఎన్నో కళలకు , కళాకారులకు ప్రసిద్ధి అని చెప్పారు. శుభకార్యాలు , పుట్టినరోజు, పెళ్ళిరోజు ల సందర్భంలో ఈ హస్తకళ ల వస్తువులను గిఫ్ట్ గా తీసుకెళ్లి వృత్తి కళాకారులను ఆదరిద్దామని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో, కార్యాలయాలలో గోల్కొండ షోరూంలో తయారు అయ్యే వస్తువులను ఖరీదు చేస్తామని చెప్పారు. గోల్కొండ కళ ఉట్టి పడేలా భవనం నిర్మించి ఏర్పాటు చేసిన గోల్కొండ అభివృద్ధి సంస్థ కు అభినందనలు తెలిపారు.

- Advertisement -