మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ అల.. వైకుంఠపురంలో. ఇటివలే ఈచిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ని రివీల్ చేయగా టీజర్ లో బన్నీ చెప్పిన డైలాగ్ అద్బుతంగా ఉందంటున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ని జెమిని టీవీ దక్కించుకుంది. ఈ మేరకు సన్ నెట్ వర్క్ అఫిషియల్ స్టేట్ మెంట్‌ని విడుదల చేసింది.
గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మోషనల్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ నటిస్తున్న 19వ సినిమా ఇది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
గతంలో బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయాన్ని సాధించాయి. ఈ మూవీ కూడా పక్కాగా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నాడు బన్నీ.