ప్రొడ్యూసర్స్ నుంచి రెమ్యునరేషన్ తీసుకోవడానికి ఇబ్బందిపడాల్సి వస్తుందని హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలపై కోలీవుడ్ నిర్మాత ఏఎల్ అజగప్పన్ మండిపడ్డారు. ధనుష్ సహకారం లేని కారణంగా నిర్మాతలు నష్టపోతున్నారని ఆరోపించారు. విజయ్,అజిత్ లాంటి అగ్రనటులు నిర్మాతలకు పూర్తి సహకారం అందిస్తున్నారని కానీ ధనుష్ విషయంలో అలా జరగడం లేదన్నారు.
ధనుష్ హీరోగా నటించిన తుల్లువదో ఇళమై నుంచి ఇప్పటివరకు తీసిన అనేక చిత్రాల్లో నిర్మాతలు వరుసగా నష్టపోయాని చెప్పారు. ధనుష్‌తో మూవీ చేస్తే నిర్మాతలు లాభాలు గడించిన దాఖలాలు లేవన్నారు. కొంతమంది సినిమా రంగానికే దూరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
ధనుష్‌తో సినిమాలు తీసిని చాలామంది నిర్మాతలు అప్పుల్లో కూరుకుపోయారని చెప్పారు నిర్మాత కె.రాజన్. రూ. 10 కోట్లు పెట్టి తీసిన చిత్రాన్ని రూ. 8 కోట్లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందని ఇలా చాలామంది నిర్మాతలు తమ ఆస్తులు పోగొట్టుకున్నారని చెప్పారు.
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్..నటులను కొందరు నిర్మాతలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి పారితోషికం తీసుకోవడానికి పనులను వదులుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు ధనుష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.