- Advertisement -
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని కలిశారు పవర్ లిఫ్టర్ క్రీడాకారిణి మల్లికా యాదవ్. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీ పురం వెంకటేశ్వర్ రెడ్డితో మినిస్టర్ క్వార్టర్‌లో మంత్రిని కలిసి నవంబర్ లో జరగబోయే సీనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడానికి తనకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందేలా చూడాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
మల్లిక విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వం నుంచి తప్పక సహాయం అందేలా చూస్తానని చెప్పారు…నవంబర్ లో 18 నుంచి 23 వరకు దుబాయ్ లో జరగబోయే సీనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ కు ఎంపికైన మల్లికా యాదవ్ ను ఈ సందర్భంగా అభినందించి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ ఛాంపియన్ పవర్ లిఫ్టర్ రాఘవేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -