భారత క్రికెట్ జట్టులో స్టార్ ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సురేష్ రైనా. తనదైన సొగసరి ఆటతో దేశవ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ అభిమానులను సందపాదించుకున్నాడు. జట్టు క్లిష్టపరిస్థితులో ఉన్నప్పుడు ఎన్నో సార్లు తనదైన ఆట తీరుతో జట్టుకు అండగా నిలిచాడు. కీలక వికెట్లు కోల్పోయి..భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. క్రిజులో నిలదొక్కుకుని జట్టును విజయతీరాలకు తీసుకుపోయాడు. ముఖ్యంగా ఛేజింగ్ లో రైనా ఆట తీరు చాలా అద్భుతం..ధోని తో కలిసి చాలా మంచి భాగస్వామ్యాన్నే నెలకొల్పాడు. మైదానంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడి షాట్స్ కు అందరూ ఫిదా కావాల్సిందే. టెస్ట్, వన్డే, టీ ట్వంటీ ఇలా మూడు ఫార్మాటలలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాటలో…ట్వంటీ ట్వంటీ స్పెషలిస్ట్ క్రికెటర్‌గా ఇమేజ్ సంపాదించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా 223 వన్డేలు ఆడిన రైనా..5568 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉండగా 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌లో గణాంకాలు అంతగా లేకపోయినా..18 టెస్ట్ మ్యాచ్‌లో 768 లతో పర్వాలేదనిపించాడు. రైనా కు టెస్ట్, వన్డే, ఫార్మాటల కన్నా ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌తో బాగా పేరు వచ్చింది. టీ20 క్రికెట్‌లో 6000 పరుగులు చేసిన మొదటి భారత బ్యాట్స్‌మన్ సురేష్ రైనానే. ముఖ్యంగా ఐపీఎల్ మనోడి ఆట ఆసాధరం అని చెప్చోచ్చు. 9 ఐపీఎల్ సీజన్లలో 4000 పరుగులు చేసిన ఒకే ఒక్కడు.
భారత క్రికెట్ జట్టు లో స్థానం సంపాదించడానికి రైనా కష్టాలే ఎదుర్కోన్నాడు. ఫామ్‌ను కంటీన్యూ చేయడంలో..జట్టులో సుస్థిర స్థానం సంపాదించడంలో కొన్ని సార్లు ఆటు పోట్లు ఎదుర్కోన్నా భారత జట్టులో తనదైన వేశాడనడంలో ఎలాంటి సందేహాం లేదు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ కోచ్‌గా ఉండగా 2005లో 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో (వన్డే) అరంగేట్రం చేశాడు సురేశ్ రైనా. బ్యాటింగ్ టెంపర్‌మెంట్, మంచి షాట్ సెలక్షన్‌తో అందరినీ తనవైపునకు ఆకర్షించాడు. 2006లో 26 వన్డేలు ఆడిన అతడు 27.77 పేలవ సగటు, 69.63 స్ట్రైక్ రేట్‌తో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటాడు. 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో పరుగుల వరద పారించి తిరిగి టీమిండియాలో స్థానం పదిలం చేసుకొన్నాడు. కొన్ని మ్యాచుల్లో కెప్టెన్, వైస్‌కెప్టెన్ బాధ్యతలు మోశాడు. టెస్టు క్రికెట్‌లో మాత్రం ప్రభావం చూపలేదు.
టీమిండియా 2011లో రెండోసారి ప్రపంచ కప్ కైవసం చేసుకొన్న జట్టులో రైనా సభ్యుడు. సిరీస్‌లో హీరో యువరాజ్‌సింగ్‌తో కలిసి పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 34 నాటౌట్, పాక్‌పై సెమీస్‌లో 36 నాటౌట్‌తో నిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకొన్నాడు. ‘ఆస్ట్రేలియాపై కీలక ఇన్నింగ్స్‌తో రైనా మనకు ప్రపంచకప్ అందించాడు’ అని అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ అన్నాడంటేనే అతడి ఇన్నింగ్సులు ఎంత కీలకమో తెలుసుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రికార్డులకు సురేశ్ రైనా పెట్టని కోట. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2008 అరంగేట్రం సీజన్‌లోనే 142.71 సగటుతో 3 అర్ధ శతకాలతో 421 పరుగులు చేశాడు. చెన్నై తరఫున ఆడిన అన్ని సీజన్లలో ఒక్క మ్యాచ్‌కు సైతం రైనా గైర్హాజరు అవ్వలేదు. 2015, 2016 సీజన్లలో తప్ప మిగతా అన్ని సీజన్లలో 400 పైచిలుకు పరుగులు సాధించడం విశేషం.
ఐపీఎల్-2013లో రైనా తొలి శతకం బాదాడు. ఐపీఎల్‌లో 100 సిక్సర్లు బాదిన ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మన్, మొత్తంగా రెండో వాడు. ఇక ఎక్కువ క్యాచ్‌లు (52) పట్టిన ఫీల్డర్, అత్యధిక స్ట్రైక్‌రేట్ ఉన్న ఒకే ఒక్కడు రైనానే. 147 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రైనా ఒక శతకం, 28 అర్ధ శతకాలు, 160 సిక్సర్లు, 138.58 స్ట్రైక్ రేట్‌తో 4,098 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 4,000 పైచిలుకు పరుగులు చేసిన తొలివాడు.. ఒకే ఒక్కడు సురేశ్ రైనా.
సురేశ్ రైనాకు తన తల్లి పర్వీశ్.. గారాల పట్టి గ్రేసియా అంటే ప్రాణం. ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగి ప్రియాంకను 2015 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది మేలో తండ్రిగా పదోన్నతి పొందాడు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే రైనాకు దైవభక్తి, దేశభక్తి చాలా ఎక్కువ. సోషల్ మీడియాలో చురుగ్గా వుండే రైనా ఖాతాల్లో సాయిబాబా చిత్రాల్ని ఎక్కువ షేర్ చేశాడు. భారత క్రీడాకారుల విశేషాలను పంచుకొంటాడు. సొట్ట బుగ్గల సుందరి, బాలీవుడ్ ఒకప్పటి స్టార్ సోనాలీ బింద్రేతో డేటింగ్ చేయడమంటే ఇష్టమట. ఆమె అందం అతడిని మైమరపిస్తుందని ఓ టీవీ షోలో చెప్పాడు. రైనాకు ఇష్టమైన క్రికెటర్ సచిన్ తెందుల్కర్. నచ్చే క్రికెట్ మైదానం: రాంచీ, ఆక్లాండ్, డ్రసింగ్‌రూమ్ లో రవీంద్ర జడేజాతో బాగా చనువుగా ఉండాడట. రైనాకు కఠిన బౌలర్ ముత్తయ్య మురళీధరన్.నచ్చే హీరోలు అబితాబ్, షారుక్