మహిళలపై నటుడు ఉత్తేజ్ హాట్ కామెంట్స్

305
Actor Uttej
- Advertisement -

మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మనకు సబంధంలేని విషయాలైతే.. ఆ ఊసెత్తకపోవడమే మంచింది. లేదంటే అంతే సంగతులు. తాజాగా సినీ నటుడు ఉత్తేజ్ ఇలాంటి విషయాల్లోనే వేలు పెట్టి, సమస్యల్లో పడ్డాడు. ఇంతకీ ఉత్తేజ్ ఏం చేశాడనే కదా మీ డౌట్. మహిళల విషయంలో ఉత్తేజ్ పబ్లీక్ గా హాట్ కామెంట్స్ చేశాడు. నైటీలు వేసుకునే ఆడవారిపై సెటైర్లు వేశాడు ఉత్తేజ్‌. కొంతమంది మహిళలు నైటీలను రాత్రితోనే ఆపరు. పగటి సమయంలో కూడా వాటితోనే తిరుగుతుంటారు. ఇంకొంతమందైతే ఏకంగా నైటీలు వేసుకుని స్కూటీలు కూడా నడిపేస్తుంటారు. అలా చేయడం కరెక్టేనా అంటూ మహిళా లోకాన్ని ప్రశ్నించాడు ఉత్తేజ్.

Actor Uttej

ఇది ఎంతవరకు సమంజసం అంటూనే..తన ప్రశ్నలో అభ్యంతరంతోబాటు జాగ్రత్త.. కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే కొంతమంది పేరెంట్స్‌ పొద్దస్తమానం ఫోన్లతోనే సమయం గడుపుతూ.. పిల్లల్ని మాత్రం ఫోన్లకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారని, అలాంటి తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకు వింటారని అన్నాడు. ఉత్తేజ్ చేసిన ఈ కామెంట్స్ పై మహిళా లోకం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నో విషయాలుండగా.. ఆయనకు ఆడవాళ్లు వేసుకునే నైటీల విషయం అవసరమా అంటూ కామెంట్స్ వినిస్తున్నాయి. మరికొందరు మాత్రం ఉత్తేజ్ ఆడవాళ్ల జాగ్రత్త కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసండంటూ చెబుతున్నారు. మరీ, ఈ విమర్శలపై ఉత్తేజ్ ఎలా రీయాక్ట్ అవుతాడో
చూడాలి.

- Advertisement -