నిమజ్జనానికి నగరంలో 23 ప్రత్యేక కొలనులు

331
ganesh-kolanu
- Advertisement -

సెప్టెంబర్ 12వ తేదీన జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి నగరంలోని ప్రధాన చెరువుల్లో నిర్మించిన 23 ప్రత్యేక నిమజ్జన కొలనులను శుభ్రపర్చడంతో పాటు స్వచ్ఛమైన నీటితో నింపుతున్నారు. లేక్‌ సిటీగా పేరుగాంచిన హైద‌రాబాద్ న‌గరంలో ఉన్న చెరువులు మ‌రింత కాలుష్యం బారిన పడకుండా ఉంచ‌డంతో పాటు శుభ్ర‌మైన నీటిలో నిమ‌జ్జ‌నాలు నిర్వ‌హించ‌డానికి జీహెచ్ఎంసీ న‌గ‌రంలో ఇప్పటికే 23 వినాయ‌క నిమ‌జ్జ‌న కొల‌నుల నిర్మాణాలను పూర్తిచేసింది. ఒక్కో నిమ‌జ్జ‌న కొల‌నులో 5వేల విగ్ర‌హాలు నిమ‌జ్జ‌నం చేసేవిధంగా నిర్మించిన ఈ నిమజ్జన కొలనులను పూర్తిస్థాయిలో శుభ్రపర్చడంతో పాటు వాటికి దారితీసే మార్గాలను మరమ్మతులు చేయడం, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించే పనులను జిహెచ్ఎంసి అధికారులు ముమ్మరంగా చేపడుతున్నారు.

వినాయక చవితి ప్రారంభమయ్యే సెప్టెంబర్ 2వ తేదీ అనంతరం మూడో రోజు నుండి ప్రారంభమయ్యే వినాయక నిమజ్జనాలకు ఈ కొలనులను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే పూర్తైన ఈ క్రింది 23 నిమజ్జన కొలనులలో నిమజ్జన ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నారు. ఊర‌చెరువు, కాప్రా, చ‌ర్ల‌ప‌ల్లి ట్యాంక్ – చ‌ర్ల‌ప‌ల్లి, అంబీర్ చెరువు – కూక‌ట్‌ప‌ల్లి, పెద్ద చెరువు- గంగారం, శేరిలింగంప‌ల్లి, వెన్న‌ల చెరువు – జీడిమెట్ల, రంగ‌ధాముని కుంట – కూక‌ట్‌ప‌ల్లి, మ‌ల్క చెరువు – రాయ‌దుర్గ్, న‌ల‌గండ్ల చెరువు – న‌ల‌గండ్ల, పెద్ద చెరువు – మ‌న్సూరాబాద్‌ స‌రూర్‌న‌గ‌ర్, హుస్సేన్‌సాగ‌ర్ లేక్, సికింద్రాబాద్, పెద్ద‌చెరువు-నెక్నాంపూర్, లింగంచెరువు-సూరారం, ముళ్ల‌క‌త్వ‌చెరువు-మూసాపేట్, నాగోల్‌చెరువు, అల్వాల్‌-కొత్త‌చెరువు, న‌ల్ల‌చెరువు- ఉప్ప‌ల్, ప‌త్తికుంట‌-రాజేంద్ర‌న‌గ‌ర్, బోయిన్‌చెరువు-హ‌స్మ‌త్‌పేట్, మియాపూర్‌-గురునాథ్‌చెరువు, లింగంప‌ల్లి- గోపిచెరువు, రాయ‌స‌ముద్రం చెరువు- రామ‌చంద్రాపురం, హ‌ఫీజ్‌పేట్‌-కైద‌మ్మకుంట, రాయ‌దుర్గ్ – దుర్గంచెరువులను నిమజ్జనాలకు సిద్దం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు.

- Advertisement -