యూరియా కొరత రాకుండా చూసుకుంటాం..

410
singireddy-niranjan-reddy
- Advertisement -

ఈ ఖరీఫ్ కు సంబంధించి 8.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం తెలంగాణకు కేటాయించింది. ఇప్పటివరకు 3.97 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది.ప్రస్తుతం 2.12 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఎరువుల కేటాయింపు అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది.ప్రతి ఏటా ఆయా రాష్ట్రాల వాడకాన్ని బట్టి కొంత కోటా పెంచడం జరుగుతుంది.పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో పాటు, కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండుగా ఉండడంతో సాగుపెరిగి ఎరువుల వాడకం గణనీయంగా పెరుగుతున్నది..దీనిని ముందే ఊహించి ఈ నెల 19న కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కి తెలంగాణ ప్రభుత్వం తరపున లేఖ రాయడం జరిగింది.

nirananjan-reddy

ఈ రోజు కేంద్ర ఎరువుల శాఖ జాయింట్ సెక్రటరీ గుర్విందర్ సింగ్‌కి ఫోన్ ద్వారా సమస్య తీవ్రతను వివరించడం జరిగింది.జిల్లాల వారీగా యూరియా డిమాండ్ పరిస్థితులను వివరించడం జరిగింది. క్రిష్ణపట్నం, వైజాగ్ పోర్టులలో ఉన్నది తెలంగాణ ర్యాక్ పాయింట్స్ కు తరలించాలని కోరడం జరిగింది
.కేంద్రం వెంటనే స్పందించి తెలంగాణకు కేటాయించిన యూరియా కోటాను వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది.వారు సానుకూలంగా స్పందించారు. వెంటనే యూరియా కోటాను పంపిస్తారని భావిస్తున్నాం.తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

- Advertisement -