సమంత..అమేజింగ్ స్టంట్

619
samantha
- Advertisement -

ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు తన ఫిట్‌నెస్ దృష్టి సారిస్తూ వస్తోంది టాలీవుడ్ బ్యూటీ సమంత. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు థ్రిల్‌ అందిస్తున్న సామ్‌..ఫిట్ నెస్‌ కోసం కూడా చాలా శ్రమపడుతోంది.

ఎప్పటికప్పుడు తాను చేసే వర్కవుట్‌కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్న సామ్ తాజాగా ఓ స్టంట్ వీడియోని షేర్ చేసింది. పోల్‌ని ప‌ట్టుకొని రెండు చేతుల‌తో పైకి ఎక్కుతూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్న సామ్ …కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయకండి .. మీ సామర్థ్యం ఏమిటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.’ అని క్యాప్ష‌న్ ఇచ్చింది.

స‌మంత స్టంట్స్‌ చూసి నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు. హీరోయిన్స్‌ న‌మ్ర‌త‌, కాజ‌ల్‌, పూజా హెగ్డే, సుశాంత్ త‌దిత‌రులు సామ్‌పై ప్రశంసలు గుప్పిస్తూ కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.

- Advertisement -