కోహ్లి 11 ఏళ్ల ప్రయాణం..

335
Virat Kohli
- Advertisement -

వరల్డ్‌ క్రికెట్‌లో పరుగుల యంత్రంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి 11 సంవత్సరాలు గడిచింది. 2008, ఆగస్టు 18న దంబుల్లాలో జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై తన అరంగేట్రాన్ని చేసిన కోహ్లీ, ఆపై ఇంతింతై, వటుడింతై అన్నట్టు ఎదుగుతూ వచ్చాడు. టెస్టులు, వన్డేలు, టీ-20లు కలిపి 68 సెంచరీలు, 95 హాఫ్ సెంచరీలతో మొత్తం 20, 502 పరుగులు సాధించాడు.

Virat-Kohli

ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను కోహ్లి తిరగరాశాడు. మొత్తం 239 వన్డేలాడిన అతడు 77 టెస్టులు, 70 అంతర్జాతీ టీ20లు పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ(11,363)ని ఇటీవలే కోహ్లి(11,520) వెనక్కి నెట్టాడు. విండీస్‌పై వరుసగా రెండు సెంచరీలు సాధించి రెండో స్థానానికి ఎగబాకాడు. తొలిస్థానంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌(18,426) కొనసాగుతున్నాడు.

ఈ సందర్భంగా కోహ్లి అప్పటి ఫొటోను జతచేస్తూ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టగా అది వైరల్ అయింది. “పదకొండు సంవత్సరాల క్రితం టీనేజర్‌గా అడుగు పెట్టాను. ఈ సుదీర్ఘ ప్రయాణం నన్ను మరింత ప్రతిబింబించేలా చేసింది. దేవుడు నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదిస్తాడని అనుకోలేదు. మీ కలల్ని సాకారం చేసుకోవడానికి సరైన మార్గాన్ని ఎంచుకోండి. అందుకు తగ్గట్టుగా శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకోండి” అంటూ పేర్కొన్నాడు.

- Advertisement -