జబర్ధస్త్ కు రోజా గుడ్ బై..

612
Roja Jabardasth
- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోలలో జబర్ధస్త్ చాలా పాపులర్ అనే చెప్పాలి. ఈషో వల్ల చాలా మంది ఆర్టీస్ట్ లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. జబర్ధస్త్ జడ్జీలు రోజా, నాగబాబు వల్లే ఈషోకు ఇంత పేరు వచ్చిందనడంతో అతిశయోక్తి లేదు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం రోజా జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పేసిందని తెలుస్తుంది. ఇటివలే గడిచిన ఎన్నికల్లో రోజా నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసిపి పార్టీ అధికారంలోకి రావడంతో రోజా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇటివలే ఆమెకు ఎపీఐఐసీ పదవిని కూడా కట్టబెట్టారు సీఎం జగన్.

ఎమ్మెల్యేగా పార్టీ వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొద్ది రోజులు జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పేసిన రోజా ఇక తిరిగి మళ్లీ రాదని అనుకున్నారు. కానీ ఆమెకు కొద్ది రోజులు కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉండటంతో తిరిగి జబర్ధస్త్ కు వచ్చారు.

ఇప్పుడు మరో కీలక మైన పదవి రావడంతో పాలనపై దృష్టి పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జబర్దస్త్‌ షో వచ్చే వారానికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో జడ్జి స్థానంలో రోజా కనిపించకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. రోజా బదులు ‘ఢీ’ షో జడ్జ్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరించారు. ఈవార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -