అలీ వల్లే నేను ఈస్ధాయిలో ఉన్నాః పూరీ జగన్నాథ్

408
Comedian Ali Purijagannth
- Advertisement -

ప్రముఖ నటుడు, కమెడీయన్ అలీ వల్లే తాను ఈస్ధాయిలో ఉన్నానని చెప్పారు దర్శకుడు పూరీ జగన్నాథ్. నటుడు అలీతో కలిసి పండుగాడి ఫోటో స్టూడియో సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నాడు పూరీ జగన్నాథ్. ఈసందర్భంగా అలీతో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నాడు. నేను పదిసంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు సీతాకోక చిలుక సినిమా చూశానన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తునిలో ఓ మ్యూజికల్ పార్టీకి అలీ వస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్లానని, అప్పుడు అలీ నా కన్నా పొట్టిగా ఉన్న అప్పట్లో అమితాబ్ బచ్చన్ సాంగ్‌కు డ్యాన్స్ వేసేవారు అని చెప్పారు.

నేను దర్శకుడిగా అయిన తర్వాత అయితో చాలా సినిమాలు తీశానని, కొన్ని హిట్లు అయ్యాయి…మరికొన్ని ప్లాప్ లు అయ్యాయన్నారు. నేను ఎప్పుడైనా బాధలో ఉంటే ఆలీ వచ్చే తనకు ఒక పెగ్గు పోసి వెళ్లిపోతారన్నారు. కొంత మంది సక్సెస్ ఉంటేనే తన దగ్గరికి వస్తారని కానీ అలీ మాత్రం నాకు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నావెంటే ఉంటాడని చెప్పారు.

తన దగ్గరికి వస్తున్నానని చెప్పకుండా నన్ను కలిసే ఏకైక వ్యక్తి అలీ అన్నారు. నా దగ్గర ఉన్న డబ్బు అంతా పోయి..నా ఆఫీస్ కూడా ఖాళీ చేద్దామనే టైంలో ఆలీ నాదగ్గరకు వచ్చి ఒక గోల్డ్ చైన్ ఇచ్చాడని చెప్పారు. నీకు దేవుడి నమ్మకం ఉంటే ఇది నీ దగ్గరపెట్టుకో అని చెప్పాడు.. అలీ బ్లెస్సింగ్స్‌తో నేను పోగొట్టుకున్నవన్నీ రెండు, మూడేళ్లలో మళ్లీ తనకు వచ్చాయని చెప్పారు.

- Advertisement -