మాజీ సైనికుడి కూతురికి కేటీఆర్ ఆర్ధిక సాయం

373
ktr helped Ex Service man Daughter
- Advertisement -

స్వాతంత్ర దినోత్సవం రోజున మాజీ సైనికుని కూతురు ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక మాజీ సైనికుని కూతురు ఉన్నత విద్య కోసం సహకారం అందించడం అత్యంత సంతోషాన్ని ఇస్తుందన్నారు . ఈరోజు తెలంగాణ భవన్లో జెండావందనం తరువాత మాజీ సైనికుడు వీరభద్రా చారి కూతురు మహాలక్ష్మి ఉన్నత విద్య కోసం అవసరమైన చెక్కును అందించారు.

ఈనెల  10వ తేదీన తన కూతురు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ లో శిక్షణ పొంది పైలట్ గా మారాలనుకుంటున్నారని కానీ తన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సహాయం చేయాల్సిందిగా కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా మాజీ సైనికుడు వీరభద్రా చారి కోరారు. ఒక సైనికుడిగా మీ ధైర్య సాహసాలు అమూల్యమైనవన్న కేటీఆర్ తనకు తోచినట్టుగా సహకరిస్తానని ట్విట్టర్ లో తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ భరత్ తో ఫోన్లో మాట్లాడి వీరభద్రా చారి కూతురు మహాలక్ష్మి కి సంబంధించిన అడ్మిషన్ గురించి వివరాలు తెలుసుకున్నారు.

హైదరాబాద్లో స్థిరపడిన వీరభద్రా చారి ఈరోజు తెలంగాణ భవన్ కి పిలిపించి తెలంగాణ ఏవియేషన్ అకాడమీ లో ఆయన కూతురు అడ్మిషన్ పొందేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ మిత్రుడి సహకారంతో అందించారు. దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక మాజీ సైనికునికి సహాయం అందించడం కన్నా గొప్పగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఏముంటుందని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

- Advertisement -