దేవభూమిని ముంచెత్తిన వరదలు….

644
kerala floods
- Advertisement -

వరదలతో భారతావని అతలాకుతలమవుతోంది. రుతుపవన వర్షాలతో దేశవ్యాప్తంగా జనజీనవం స్తంభించింది. దేశ వ్యాప్తంగా 200 మంది వరకు దుర్మరణం చెందారు. దక్షిణాదిన కేరళ, కర్ణాటకలోని పలు జిల్లాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. కేరళ పరిస్థితి దారుణంగా ఉంది.

ప్రజలను మరింత సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు కేరళ ప్రభుత్వం మిలటరీ సాయం కోరింది. వైమానిక దళ సాయంతో ఆహారపొట్లాలను జారవిడుస్తున్నారు. సుమారు 2 లక్షల మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ అక్కడకు చేరుకుని వరద సహాయక కార్యక్రమాలు సమీక్షిస్తున్నారు.

Image result for కేరళ వరదలు

ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయన్న భారత వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో కేరళలోని మలప్పురం, కోజికోడ్‌ జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కేరళ వరదల ఘటనల్లో మంగళవారంనాటికి 91 మంది చనిపోగా, 40 మంది గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. భారీ వరదలతో అల్లకల్లోలమైన మహారాష్ర్ట, కర్ణాటక, గోవాలో భారత నౌకా దళం సహాయక చర్యలు చేపట్టింది. వర్ష రహత్‌ ఆపరేషన్‌ పేరుతో చేపట్టిన వరద సహాయక చర్యల్లో దాదాపు 14వేల మందిని కాపాడినట్టు నౌకా దళం ప్రకటించింది.

- Advertisement -