వరద బాధితులకు ఎంపీ అసద్‌ విరాళం…

340
asaduddin owaisi

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ,మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్నాయి. వరద ప్రభావంతో వేలాది గ్రామాలు నీట ముననగా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తనవంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.

కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకు పదేసి లక్షల రూపాయల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ డబ్బును పంపనున్నట్టు తెలిపారు.

వరదల వల్ల కేరళలో 91 మంది, మహారాష్ట్రాలో 59 మంది మరణించారు. వేలాదిమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు ముందుకొచ్చారు.