ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ట్విటర్ నుంచి తప్పుకొన్నారు. దేశంలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న దర్శకుల్లో అనురాగ్ కశ్యప్ ఒకరు. సమాజంలోని తప్పులను ఎత్తిచూపే విధంగా కశ్యప్ సినిమాలు ఉంటాయి. ప్రేక్షకులపైన ఆయన సినిమాలు బలమైన ప్రభావాన్ని చూపుతుంటాయి. చెప్పాలనుకున్న విషయాన్ని అనురాగ్ సూటిగా భయం లేకుండా చెప్తుంటాడు.
సినిమాల్లో ఎలాగైతే విషయాన్ని భయం లేకుండా చెప్పగలుగుతాడో.. అలానే రియల్ లైఫ్ లో కూడా భయం లేకుండా… చెప్పాలనుకునే విషయాన్ని అందరికి అర్ధం అయ్యేలా చెప్పడంతో దిట్ట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కశ్యప్ సడెన్ గా ట్విట్టర్ నుంచి పక్కు తప్పుకున్నాడు.
‘ఆన్లైన్లో నా తల్లిదండ్రులను, కుమార్తెను బెదిరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. కానీ ఎవ్వరూ దీని గురించి పట్టించుకోవడం లేదు. దేశంలో దోపిడీ దొంగల పాలన నడుస్తోంది. ఈ పాలనకే మనం అలవాటుపడాలి. ఈ నవ భారత్‌లో మీరంతా బతకగలుగుతారని ఆశిస్తున్నాను.
నేను ట్విటర్ నుంచి తప్పుకొంటున్నాను. ఇదే నా చివరి ట్వీట్. ఎలాంటి భయం లేకుండా నా అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం నాకు లేనప్పుడు నేను ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిది. గుడ్‌బై’ అని చెప్పారు.