కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా సోనియా గాంధీ..!

354
soniya
- Advertisement -

శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ను ఎన్నుకున్నారు. గత కొద్దినెలలుగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనిశ్చితిని సరిదిద్దేందుకు ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షురాలిగా యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీని ఎంపిక చేస్తున్నట్టు శనివారం రాత్రి 11 గంటలకు తీర్మానం చేసింది.

sonia gandhi

తదుపరి పార్టీ చీఫ్‌ను ఎన్నుకునేంత వరకూ సోనియా బాధ్యతలు నిర్వర్తిస్తారని సీడబ్ల్యూసీ పేర్కొంది. పార్టీ అధ్యక్షురాలిగా సోనియాను ఎంపిక చేసినట్లు ఆజాద్ ప్రకటించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాహుల్ గాంధీ అంగీకరించకపోవడంతో సోనియాకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

- Advertisement -