వివేక్ కు పార్టీలు మారడం కొత్త కాదుః పిడమర్తి రవి

417
Pidamarthi Ravi Vivek
- Advertisement -

మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి పార్టీలు మారడం కొత్త కాదన్నారు టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి. వివేక్ బీజేపీలో చేరడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు . దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతుంటే బీజేపీలో చేరడం ఎంత వరకు సబబు అని అన్నారు..అది దళితులకు మీరు చేసే ద్రోహం కాదా అని ప్రశ్నించారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాం పెట్టాలని డిమాండ్ చేసిన మీరు ఇవాళ అంబేద్కర్ వ్యతిరేక పార్టీలో చేరడం..అంబేద్కరి ఇజానికి వ్యతిరేకం కాదా అన్నారు.

వెంకటస్వామి ఆశయాలను వివేక్ తుంగలో తొక్కారన్నారు. వివేక్ తండ్రి వెంకటస్వామి అంబేద్కర్ వాది..అలాగే కాంగ్రెస్ వాది..కానీ మీరు ఇవాళ కాకా ఆశయాలకు విరుద్దంగా మనువాదంలో చేరారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విరుద్దంగా పనిచేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అందుకోసమే గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు పార్టీ టికెట్ ఇవ్వలేదన్నారు.

- Advertisement -