భారతీయుడు2 విడుదల తేదీ ఖరారు

310
Bharatiyudu2 copy
- Advertisement -

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రాబ్లమ్ సాల్వ్ కావడంతో త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

లైకా ప్రొడక్షన్స్ సంస్ధ ఈసినిమాను సుమారు రూ. 200కోట్లతో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈసినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్ర యూనిట్. 2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.

ఆ దిశగానే షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. కమల్ సరసన కాజల్ హీరోయిన్న గా నటిస్తున్న ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇక శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -